Cotton Products
బోల్గార్డ్ II" మరియు బోల్వార్క్ నియంత్రణ కొరకు సాగు సూచనలు Telugu బోల్గార్డ్ II* కాటన్ హైబ్రిడ్ రెండు బిటి ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తాయి. అవి, Cry1 Ac మరియు Cry2Ab, పత్తి ని ఆశించే కీలకమైన కాయతోలుచు పురుగులను నియంత్రిస్థాయి. భారత ప్రభుత్వం డిసెంబర్ 27,2016 నాటి గెజిట్ నోటిఫికేషన్, S.O.4215 (E) ప్రకారం, ఈ ప్యాకెట్లోని విత్తనాలకు 5% నాన్-బిటి రెఫ్యూజియా విత్తనాలు కలపబడ్డాయి. ఈ సాంకేతికత పత్తి యొక్క రసం పీల్చే కీటాకాలను నియంత్రించదు. రెఫ్యూజియా-ఇన్-బాగ్ (RIB) పద్ధతి: బిటి కాటన్ సీడ్ బ్యాగ్ లో 5% నాన్ బిటి విత్తనాలను కలపడాన్ని రెఫ్యూజియా-ఇన్-బాగ్ (RIB) పద్ధతి అంటారు. నాన్ బిటి హైబ్రిడ్, బిటి హైబ్రిడ్ మాదిరిగానే కాలవ్యవధి మరియు ఫైబర్ లక్షణాలను కలిగి ఉంటుంది. నాన్ బిటి విత్తనాలను కలపడం వల్ల పత్తి దిగుబడి తగ్గదు. అయితే పత్తి ని ఆశించే కీలకమైన కాయతొలుచు పురుగులలో బిటి నిరోధక శక్తి అభివృద్ధి కాకుండా RIB సహాయపడుతుంది మరియు బిటి సాంకేతికత యొక్క మన్నికను పెంచుతుంది. బోల్గార్డ్ II° సాగు నుండి గరిష్ట దిగుబడి పొందడానికి సాధారణ మార్గదర్శకాలు పొలం తయారు చేసుకొను విధానం : మునుపటి పంట యొక్క ఎండిన మొక్కలను కాండములను తొలగించి కాల్చివేయవలెను. వేసవి లో పొలాన్ని బాగా లోతుగా దున్నాలి. దీనివల్ల నేలలో పుట్టే తెగుళ్లను, చీడ పీడలను మరియు కలుపుమొక్కల్ని ఆరికట్టవచ్చు. విత్తనాలు విత్తడానికి ముందు నేలను బాగా దున్ని చదును చేసుకోవాలి. జీవ సంభంధ మరియు రసాయన ఎరువులు : విత్తడానికి 3 నుండి 4 వారాల ముందు 5 నుండి 6 టన్నుల పశువుల ఎరువు (కంపోస్ట్) ను వేసుకోవాలి. రసాయన ఎరువులు: భూసార పరీక్ష ఆధారంగా మరియు సిఫార్సు చేసిన పద్ధతుల ప్రకారం ఎరువులు వేయండి. మొక్కల మధ్య నిడివి (spacing): స్థానికంగా సిఫార్సు చేసిన పద్ధతుల ప్రకారం మొక్కల మధ్య నిడివి పాటించాలి. విత్తనాలు నాటే పద్ధతి: సరైన మొక్కల సంఖ్య ఉండడానికి ప్రతి చోట 2 విత్తనాలు నాటండి. విత్తనాలు మొలకెత్తిన తరువాత, బాగుగా ఉన్న మొక్కని ఉంచి, బలహీనం గా ఉన్న మొక్కను తీసివేయవలెను. మొక్కల మధ్య ఖాళీని భర్తీచేయుట (పడు పాదులు): అవసరమైతే ఒక వారం వ్యవధిలో పడు పాదులు వేసుకొని మొక్కల మధ్య ఖాళీని భర్తీ చేసుకోవాలి. అంతర సేద్యం మరియు కలుపు నియంత్రణ: కలుపు మొక్కల పెరుగుదలను నియంత్రించడానికి కలుపు తీయుట మరియు అంతర సాగు పద్దతులను అనుసరించండి. ఇది నేలలో తేమను ఉంచడానికి సహాయపడుతుంది. మరియు సిఫార్సు చేసిన కలుపు మందును పిచికారి చేసుకోవచ్చు. నీటిపారుదల: పంట యొక్క ముఖ్యమైన దశలు, అనగా విత్తనాలు మొలకదశ, మొలక పెరుగుదల, మొగ్గ తొడిగే దశ, కాయ ఏర్పడు మరియు అభివృద్ధి దశలలో నీటి కొరత లేకుండా చూసుకోవాలి. మరియు పొలంలో ఎక్కువ నీరు నిల్వ లేకుండా చూసుసుకోవాలి. సమగ్ర సశ్య రక్షణ : 1. పైన చెప్పినట్లుగా వేసవిలో లోతుగా దున్నుట మరియు పొలం శుభ్రంగా ఉంచుకోవడం. 2. విత్తన శుద్ధి: రసంపీల్చే పురుగులను నివారించడానికి బిజి ॥ పత్తి విత్తనాలను ముందే విత్తనశుద్ధి చేస్తారు. 3. రసంపీల్చే పురుగుల నివారణ: పంట ఏ దశలోనైనా రసం పీల్చుకునే పురుగుల ప్రమాదకర స్థాయి (ఎకనామిక్ త్రెషోల్డ్ స్థాయి ETL) దాటితే, నియంత్రణ కోసం సిఫార్సు చేసిన పురుగుమందులను పిచికారీ చేయండి.
_edited.jpg)