Red Gram Products
వాతావరణం
● కంది సాగుకు 18-30°C ఉష్ణోగ్రత కలిగిన ప్రాంతాలు అనుకూలం. కంది అధిక ఉష్ణోగ్రత (40°C) వరకు కూడా తట్టుకుంటుంది.
నేలలు
● కందిసాగుకు అన్ని రకాల నేలలు అనుకూలం. లోతుగా ఉండే మరియు మురుగు నీరు పోవు సామర్థ్యం కలిగిన ఎర్ర మురుగు నల్ల నేలలు బాగా అనుకూలం.
నేల తయారీ
● నేలను ఒకసారి లోతుగా దున్ని, తరువాత గోరులతో 2-3 సార్లు దున్ని మెత్తగా తయారు చేసుకోవాలి. వేసవిలో లోతుగా దున్నడం వలన నేలలో తేమ ఎక్కువగా నిల్వ ఉంటుంది. నేలను సమాంతరంగా చదును చేయడం వల్ల త్వరగా మురుగు నీరు బయటకు వెళ్లిపోవును.
● విత్తన మోతాదు : ఎకరాకు 4-6 కిలోలు
విత్తన సమయం
● జూన్ 15-జూలై 15 (వర్షాకాలం).
విత్తే పద్ధతి
● సీడ్ డ్రిల్ యంత్రం తో గాని, చేతితో గాని విత్తుకోవాలి. (విత్తన శుద్ధి = కిలో విత్తనానికి 3గ్రా రైజోబియం బ్యాక్టీరియా తో విత్తన శుద్ధి చేసుకోవాలి.)
నేలను బట్టి వరుసల మధ్య దూరం పెట్టుకోవాలి. సాధారణంగా 120x30cm దూరంలో విత్తుకోవాలి లేదా 90x30cm దూరంలో విత్తనాలు విత్తుకోవాలి.
ఎరువుల వాడకం
● హెక్టారుకు 10 టన్నుల పశువుల ఎరువు వేయుకోవాలి.
● ఎకరానికి 8:24:8 కిలోల NPK ఎరువును ఆఖరి దుక్కిలోను, మరియు 10 కిలోల జింక్ సల్ఫేట్ ను విత్తనానికి ముందు వేయుకోవాలి.
● సరియైన ఎరువుల యాజమాన్యం కొరకు మీ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సంప్రదించండి.
కలుపు నివారణ
● పెండిమిథలిన్ మందు 3 మి.లి./లీటర్ నీటికి కలిపి విత్తే ముందు నేలపై పిచికారీ చేయాలి. తరువాత అవసరాన్ని బట్టి 2-3 సార్లు చేతితో కలుపు తీయాలి.
నీటి యాజమాన్యం
● మొలక శాతం పెరగడానికి, విత్తన తరువాత ఒక తేలిక పాటి నీరు ఇవ్వాలి. పంట పుష్పించే దశలో మరియు గింజ గట్టిపడే దశలో నీటి యాజమాన్యం కీలకం.
చీడపీడల నివారణ
● కాయతులచు పురుగు, కాయ ఈగ మరియు ఆక ముడత పురుగులు కాయ తయారీ దశలో 30-50% నష్టం కలిగిస్తాయి.
నివారణ - ఇమామెక్టిన్ బెంజోయేట్ 5% SC @ 1 గ్రా/లీటర్ లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 18.5% SC @ 0.2 మి.లి./లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
తెగుళ్ళ నివారణ
● వేరుకుళ్లు కాండ కుళ్లు నివారణకు పంట మార్పిడి విధానాన్ని తప్పక పాటించాలి, సరైన మురుగు నీరు పోవు సామర్థ్యం తో నేలను వాడాలి. ట్రైకోడెర్మా తో విత్తన శుద్ధి చేసుకోవడం ద్వారా ఈ తెగులు వ్యాప్తిని నివారించవచ్చు.
పంట కోత
● కంది పంటను రకాల్ని బట్టి కాయలు 75-80% పరిపక్వతకు వచ్చిన తరువాత కోయుకోవాలి.
గమనిక:
● సరైన పంటయాజమాన్యం కొరకు, మీ దగ్గరలో ఉన్న KVK గానీ, వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని గానీ లేదా వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించండి.
● కంది పంట దిగుబడి, పంటయాజమాన్యం పైన్ మరియు అనుకూల వాతావరణ పరిస్థితుల పై ఆధారపడి ఉంటుంది
_edited.jpg)