Cotton Products
బోల్గార్డ్ II" మరియు బోల్వార్క్ నియంత్రణ కొరకు సాగు సూచనలు
బోల్గార్డ్ II* కాటన్ హైబ్రిడ్ రెండు బిటి ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తాయి. అవి, Cry1 Ac మరియు Cry2Ab, పత్తి ని ఆశించే కీలకమైన కాయతోలుచు పురుగులను నియంత్రిస్థాయి. భారత ప్రభుత్వం డిసెంబర్ 27,2016 నాటి గెజిట్ నోటిఫికేషన్, S.O.4215 (E) ప్రకారం, ఈ ప్యాకెట్లోని విత్తనాలకు 5% నాన్-బిటి రెఫ్యూజియా విత్తనాలు కలపబడ్డాయి. ఈ సాంకేతికత పత్తి యొక్క రసం పీల్చే కీటాకాలను నియంత్రించదు.
రెఫ్యూజియా-ఇన్-బాగ్ (RIB) పద్ధతి: బిటి కాటన్ సీడ్ బ్యాగ్ లో 5% నాన్ బిటి విత్తనాలను కలపడాన్ని రెఫ్యూజియా-ఇన్-బాగ్ (RIB) పద్ధతి అంటారు. నాన్ బిటి హైబ్రిడ్, బిటి హైబ్రిడ్ మాదిరిగానే కాలవ్యవధి
మరియు ఫైబర్ లక్షణాలను కలిగి ఉంటుంది. నాన్ బిటి విత్తనాలను కలపడం వల్ల పత్తి దిగుబడి తగ్గదు. అయితే పత్తి ని ఆశించే కీలకమైన కాయతొలుచు పురుగులలో బిటి నిరోధక శక్తి అభివృద్ధి కాకుండా RIB సహాయపడుతుంది మరియు బిటి సాంకేతికత యొక్క మన్నికను పెంచుతుంది.
బోల్గార్డ్ II° సాగు నుండి గరిష్ట దిగుబడి పొందడానికి సాధారణ మార్గదర్శకాలు
పొలం తయారు చేసుకొను విధానం : మునుపటి పంట యొక్క ఎండిన మొక్కలను కాండములను తొలగించి కాల్చివేయవలెను. వేసవి లో పొలాన్ని బాగా లోతుగా దున్నాలి. దీనివల్ల నేలలో పుట్టే తెగుళ్లను, చీడ పీడలను మరియు కలుపుమొక్కల్ని ఆరికట్టవచ్చు. విత్తనాలు విత్తడానికి ముందు నేలను బాగా దున్ని చదును చేసుకోవాలి.
జీవ సంభంధ మరియు రసాయన ఎరువులు : విత్తడానికి 3 నుండి 4 వారాల ముందు 5 నుండి 6 టన్నుల పశువుల ఎరువు (కంపోస్ట్) ను వేసుకోవాలి.
రసాయన ఎరువులు: భూసార పరీక్ష ఆధారంగా మరియు సిఫార్సు చేసిన పద్ధతుల ప్రకారం ఎరువులు వేయండి.
మొక్కల మధ్య నిడివి (spacing): స్థానికంగా సిఫార్సు చేసిన పద్ధతుల ప్రకారం మొక్కల మధ్య నిడివి పాటించాలి.
విత్తనాలు నాటే పద్ధతి: సరైన మొక్కల సంఖ్య ఉండడానికి ప్రతి చోట 2 విత్తనాలు నాటండి. విత్తనాలు మొలకెత్తిన తరువాత, బాగుగా ఉన్న మొక్కని ఉంచి, బలహీనం గా ఉన్న మొక్కను తీసివేయవలెను.
మొక్కల మధ్య ఖాళీని భర్తీచేయుట (పడు పాదులు): అవసరమైతే ఒక వారం వ్యవధిలో పడు పాదులు వేసుకొని మొక్కల మధ్య ఖాళీని భర్తీ చేసుకోవాలి.
అంతర సేద్యం మరియు కలుపు నియంత్రణ: కలుపు మొక్కల పెరుగుదలను నియంత్రించడానికి కలుపు తీయుట మరియు అంతర సాగు పద్దతులను అనుసరించండి. ఇది నేలలో తేమను ఉంచడానికి సహాయపడుతుంది. మరియు సిఫార్సు చేసిన కలుపు మందును పిచికారి చేసుకోవచ్చు.
నీటిపారుదల: పంట యొక్క ముఖ్యమైన దశలు, అనగా విత్తనాలు మొలకదశ, మొలక పెరుగుదల, మొగ్గ తొడిగే దశ, కాయ ఏర్పడు మరియు అభివృద్ధి దశలలో నీటి కొరత లేకుండా చూసుకోవాలి. మరియు పొలంలో ఎక్కువ నీరు నిల్వ లేకుండా చూసుసుకోవాలి. సమగ్ర సశ్య రక్షణ :
1. పైన చెప్పినట్లుగా వేసవిలో లోతుగా దున్నుట మరియు పొలం శుభ్రంగా ఉంచుకోవడం.
2. విత్తన శుద్ధి: రసంపీల్చే పురుగులను నివారించడానికి బిజి ॥ పత్తి విత్తనాలను ముందే విత్తనశుద్ధి చేస్తారు.
3. రసంపీల్చే పురుగుల నివారణ: పంట ఏ దశలోనైనా రసం పీల్చుకునే పురుగుల ప్రమాదకర స్థాయి (ఎకనామిక్ త్రెషోల్డ్ స్థాయి ETL)
దాటితే, నియంత్రణ కోసం సిఫార్సు చేసిన పురుగుమందులను పిచికారీ చేయండి.
పురుగు ప్రమాదకర స్థాయి (ఎకనామిక్ త్రేషోల్డ్ ETL)
పచ్చదోమ ఒక ఆకుకి 1-2 లార్వాలు లేదా రెక్కల పురుగులు
తెల్ల దోమ ఒక ఆకుకు 8-10 లార్వాలు లేదా రెక్కల పురుగులు
పేనుబంక 10% సోకిన మొక్కలు
తామర పురుగు ఒక ఆకుకి 10 లార్వాలు లేదా రెక్కల పురుగులు
పిండి నల్లి ఒక ఆకుకి 20 లార్వాలు లేదా 10 రెక్కల పురుగులు
4. కాయ తొలుచు పురుగు (బోల్వార్మ్) నివారణ: పురుగుల ఉధృతి ఇటిఎల్ ఆధారిత ప్రమాదకర స్థాయికి (ఇటిఎల్) చేరితే లేదా మించి ఉంటే పురుగుమందుల స్ప్రేయింగ్" అవసరం కావచ్చు. పురుగుల ఉధృతి ETL కి చేరుకున్నాయో లేదో తెలుసుకోవడానికి, ప్రతి వారం పొలంలో తిరిగి ఈ క్రింది
చర్యలు తీసుకోవాలి;
(1) శనగపచ్చపురుగు (అమెరికన్ బోల్వార్క్; ABW): పొలంలో అక్కడక్కడ ఎకరాకు 20 బోల్గార్డ్ II మొక్కలను ఎంచుకోండి. రెండు లేదా అంతకంటే ఎక్కువ శనగపచ్చపురుగు లార్వాలు 20 మొక్కలకు కనుగొంటే; లేదా ఈ 20 మొక్కలపై మొత్తం కాయలలో 10% శనగపచ్చపురుగు తిన్న కాయలు దొరికితే ఇటిఎల్ కు చేరుకుంటుంది.
(ii) గులాబీ రంగు పురుగు: పొలంలో అక్కడక్కడ ఎకరాకు 20 పువ్వులు లేదా పెద్ద కాయలు ఎంచుకోండి మరియు అందులో గులాబీ పురుగు లార్వా సంఖ్యను లెక్కించండి. మీరు 2 లేదా అంతకంటే ఎక్కువ గులాబీ పురుగు లార్వాలను లెక్కించినట్లయితే ఇటిఎల్ కు చేరుకుంటుంది.
లింగాకర్షక బుట్టలు: ఎకరానికి 3 బుట్టలు పెట్టుకోవాలి. వరుసగా మూడు రాత్రులు, ప్రతి బుట్టకు సగటున 8 గులాబీ పురుగు రెక్కల పురుగులు గమనిస్తే ఇటిఎల్ కు చేరుకుంటుంది.
*మీ స్థానిక వ్యవసాయ విశ్వవిద్యాలయం లేదా వ్యవసాయ శాఖ సిఫార్సు చేసిన పురుగుమందులను ఉపయోగించండి.
గమనిక: పొగాకు లద్దె పురుగు, స్టెమ్ వీవిల్ మొదలైన ఇతర కీటకాల కోసం సిఫార్సు చేసిన పద్ధతులను అనుసరించండి.
5. ఇతర పద్ధతులు: లింగాకర్షక బుట్టలు, లైట్ ట్రాప్స్ / అవరోధ పంటలు, పక్షి స్టాండ్లు, సహజ శత్రువుల వాడకం, బయో పురుగుమందులు (HaNPV, Neem) మొదలైన ఇతర సిఫార్సు చేసిన సమగ్ర సశ్య రక్షణ పద్ధతులను కూడా అనుసరించవచ్చు. 6. ఒకే తరగతికి చెందిన పురుగుమందుల వాడకాన్ని మానుకోండి.
7. సకాలంలో పంట తీసివేయుట: అధికంగా గులాబీ పురుగు ఉన్న ప్రాంతాల్లో బోల్డార్డ్ II పంట యొక్క పునర్జీవం (రీ-ఫ్లషింగ్) మానుకోండి. పంటను దీర్ఘకాలం సాగు చేసిన యెడల గులాబీ రంగు పురుగు ఉధృతి పెరుగును మరియు తరువాతి సీజన్ కు ఈ పురుగు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది.
8. పొలం శుభ్ర త: బోల్వార్క్ లార్వా, ముఖ్యంగా గులాబీ రంగు పురుగు, ఎండిన లేదా సరిగ్గా తెరుచుకోని కాయలలో ఉంటుంది.
తెరుచుకోని కాయలను
పత్తి కాండాల నుండి లేదా భూమి నుండి తీసివేసి లోతైన గుంటలలో పాతిపెట్టండి.
9. లోతుగా దున్నుట: అన్ని బోల్వార్క్ల్మ ప్యూపాలను బహిర్గతం చేయడానికి మరియు చంపడానికి పంట తర్వాత దున్నుకోవాలి
మరియు దీనిద్వారా గులాబీ రంగు పురుగు యొక్క లార్వాలను నాశనం చేయడం.
పత్తి పంటలో వచ్చే సాధారణ తెగుళ్ల నివారణ
ఆల్టర్నేరియా ఆకు మచ్చ తెగులు, బూడిద తెగులు, లీఫ్ బ్లైట్ మరియు కాయ కుళ్ళు తెగులు (బోల్ రాట్) వంటి వ్యాధుల నివారణకు అవసరమైన సిఫార్సు చేసిన పద్ధతులను అనుసరించండి.
ఆల్టర్నేరియా ఆకు మచ్చ తెగులు (Alternaria macrospora): ఆల్టర్నేరియా ఆకు మచ్చ తెగులు మొదట ఆకుల
పై చిన్న, లేత గోధుమ రంగు వృత్తాకార మచ్చలుగా కనిపిస్తుంది. మచ్చలు నెమ్మదిగా విస్తరిస్తాయి మరియు వృత్తాకార వలయాలుగా అభివృద్ధి చెందుతాయి. సెర్కోస్పోరా లీఫ్ స్పాట్ (Cercospora gossypina): ఆకులపై ఎర్రటి చుక్కలుగా ఈ తెగులు లక్షణాలు మొదలవుతాయి. మచ్చలు నెమ్మదిగా విస్తరిస్తాయి. ఈ మచ్చల మధ్యలో తెల్లని లేదా లేత గోధుమ రంగులో చనిపోయిన కణజాలం మరియు చుట్టూ ఎర్రని
గీత ఉంటుంది.
బూడిద తెగులు (Ramularia areola): ఆకులపై పసుపు పచ్చ రంగు మచ్చలు ఏర్పడి అవి నెమ్మదిగా త్రికోణ ఆకృతిలో వృద్ధి చెందుతాయి. క్రమంగా అవి పసుపు నుండి ఎర్రటి గోధుమ రంగులోకి మారుతాయి మరియు ప్రధానంగా ఆకు క్రింది బాగాన తెల్లటి శిలీంధ్రం పెరుగుదల కనిపిస్తుంది, కానీ అప్పుడప్పుడు ఆకు పై బాగాన కూడా కనిపిస్తుంది.
బాక్టీరియా ఆకుమచ్చ తెగులు (Xanthomonas campestris py. malvacearum): వ్యాధి లక్షణాలు త్రికోణ ఆకృతిలో ఆకులపై మచ్చలు, ఈనెలు నల్లగా మారుట, కాండం మరియు కొమ్మలపై ముడతలు కనిపిస్తాయి. మచ్చలు మొదట నీటి మచ్చలుగా ఉండి, తరువాత గోధుమ రంగులోకి మారుతాయి.
సమగ్ర నివారణ చర్యలు
i)తగినంత పోషకాలు మరియు సరైన నీటి నిర్వహణ పంటను ఆకు తెగుళ్ల బారిన పడకుండా కాపాడుతుంది.
ii) తగినంత పశువుల ఎరువును వేసుకోవాలి
iii) మొక్కల మధ్య గాలిలో తేమను తగ్గించడానికి మొక్కల మధ్య సరైన నిడివి మరియు జంట వరుస పద్ధతి లో మొక్కల ను నాటుకోవాలి.
vi)తెగులు సోకిన ఆకులను తొలగించడం మరియు నాశనం చేయడం వల్ల ఆకు మచ్చ తెగులు తీవ్రత తగ్గుతుంది.
v)శిలీంధ్ర ఆకుమచ్చ తెగుళ్ల నియంత్రించడానికి పంటను కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా సల్ఫర్ 2-2.5 g + బావిస్టిన్ 1-1.5 g ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
బాక్టీరియా ఆకుమచ్చ తెగుళ్ల నియంత్రించడానికి పంటను కాపర్ ఆక్సిక్లోరైడ్ 2-2.5 g + స్టెప్టోసైక్లిన్ 0.1 g ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి
vi) కాపర్ ఆక్సిక్లోరైడ్ 2-2.5 g + బావిస్టిన్ 1-1.5 g + స్ట్రెప్టో సైక్లిన్ 0.1 g ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయడం ద్వారా శిలీంధ్ర మరియు బాక్టీరియ తెగుళ్లను నివారించవచ్చు.
_edited.jpg)